
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.
కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్‌గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.
అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment