
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా బాధ్యతల అప్పగింతపై ఈటల రాజేందర్ స్పందించారు. కీలక బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారాయన. అలాగే.. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఓడించాలని తెలంగాణ సమాజానికి పిలుపు ఇచ్చారాయన.
‘తెలంగాణ ప్రజల అంతరంగం నాకు తెలుసు. ఈ ప్రాంత సమస్యలూ నాకు తెలుసు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగానే ఉన్నారు. బీఆర్‌ఎస్ గెలిస్తే.. ఒక కటుంబం మాత్రమే అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే.. ఒక వర్గం అధికారంలోకి వస్తుందని అన్నారాయన.
కేసీఆర్ అహంకారాన్ని ఓడించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమన్న ఈటల.. కేసీఆర్ బలం, బలహీనతలు తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని మరోమారు స్పష్టం చేశారు. అయితే.. కొత్త చీఫ్ కిషన్‌రెడ్డితో మంచి సఖ్యత ఉందని, ఆయనతో కలిసి పని చేస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం అని ఈటల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment