సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. తెలంగాణ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పించిన నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా?. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయి.
వివరాల ప్రకారం.. బండి సంజయ్ మార్పు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ హైకమాండ్‌పై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న బండి సంజయ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లేదన్నారు. కిషన్‌రెడ్డిని డీగ్రేడ్ చేయడం సరికాదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి నేతల మధ్య పార్టీ బలపడదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక, ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఆదివారం హుటాహుటిన చంద్రశేఖర్‌ను ఈటల కలిశారు. ఈ సందర్భంగా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తనకి ఏమి చెప్పలేదని.. తాను పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే చర్చించామని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్‌కు షాక్ తప్పదా?.. రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment