
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక, నిన్న(గురువారం) బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.
ఇక, తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి అలా ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలి. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. బీజేపీలో క్రమశిక్షణ పట్టాలు తప్పుతుండటంతో గీత దాటుతున్న నేతలకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను హెచ్చరించారు. క్రమశిక్షణారాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్టేనని అన్నారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. పార్టీలో ఒక లక్ష్మణ రేఖ ఉందని మర్చిపోకూడదని సూచించారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment