మాల్స్‌ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా? | BJP MP Etela Rajender Letter to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

మాల్స్‌ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?

Published Mon, Oct 7 2024 4:15 AM | Last Updated on Mon, Oct 7 2024 4:15 AM

BJP MP Etela Rajender Letter to CM Revanth Reddy

సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: బ్యూ టిఫికేషన్‌ పేరిట మాల్స్‌ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి? డీపీఆర్‌ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్‌ చేశారు.

స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement