సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది.. కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా తలపెట్టింది. రాష్ట్రంలో పేదలకు డబుల్ బ్రెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంపై బీజేపీ నిరసనకు దిగింది. ఈ మహాధర్నా బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి దించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మోసం చేయడం, గొంతు కోయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదు. దోపిడీ డబ్బుతో కేసీఆరే ఫార్మ్ హౌస్‌లు కట్టుకుంటున్నారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. తెలంగాణలో నిజాం నవాబుల పాలన, అబద్దాల పాలన కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మోసం చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్‌కు లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మంది ఇళ్లు లేని పేదలున్నారు. ఏపీలో 20లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. 5వేలలకు పైగా ఎకరాల అసైన్డ్‌మెంట్ భూములు పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఇక, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కల్వకుంట కుటుంబమంతా దొంగలే. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో సమస్యలు పెరిగాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయి. ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం అన్నారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వైన్స్ టెండర్స్ మాత్రం పక్కాగా జరుగుతాయి. ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి. అది లేనే లేదు. కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలి. అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మికి ఎలా దరఖాస్తు చేస్తారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డబుల్ డిజిట్‌గా కూడా రాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: సంక్షేమంలో మేమే నంబర్ వన్ అంటూ.. 'ఎవరి ధీమా వారిదే'!
Comments
Please login to add a commentAdd a comment