ఈవీఎంలో అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తం
అంతు చిక్కని ఓటర్ల నాడి
ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకుల్లో టెన్షన్
చంపాపేట: పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగియడంతో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో నిలచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గెలుపుపై టెన్షన్ మొదలైంది. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి పని చేశారు. ఓటర్లు అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఎల్రక్టానిక్ యంత్రాల్లో భద్రపర్చారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులూ తమ పార్టీ అభ్యర్థుల విజయంపై ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటుండగా, ఎల్‌బీనగర్‌లోని ప్రధాన పారీ్టల అభ్యర్థులు, నాయకులు మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఓటింగ్ శాతం తాము ఊహించినంతగా లేకపోవటంతో లోలోపల మాత్రం వారిలో ఆందోళన నెలకొంది.
👉 మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఎల్‌బీనగర్‌తో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే అధిక ఓటర్లు కలిగిన ఎల్‌బీనగర్ శాసన సభ నియోజకవర్గ పరిధిలో 6,04,763 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ 46.27 శాతం మాత్రమే కావటంతో ఆ ప్రభావం ఏ పార్టీ అభ్యర్థి జయాపజయాలపై చూపుతుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు,
👉 మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేయడం వల్ల ఎల్‌బీనగర్ వాసులు, అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సబంధాలు ఉన్నాయి. దానికి తోడు ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆయన తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ కార్పొరేటర్లు, క్రియాశీలక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈటల విజయం కోసం ఏమాత్రం పాటు పడ్డారో అభ్యర్థి జయాపజయాలను నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
👉 బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి ఉన్న కొద్దిపాటి పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ రాగిడి విజయానికి అహరి్నషలు కృషి చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు నోచుకోక పోవటం వంటి అంశాల వల్ల రాగిడి లక్ష్మారెడ్డికి ఎల్‌బీ నగర్‌లో మెజారిటీ ఓట్లు వచ్చి విజయం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి ఎల్‌బీనగర్‌లోని పలు పార్టీ నేతలతో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. దీనికి తోటు ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఇతర పారీ్టలనుంచి కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరి బూత్ స్థాయినుంచి పార్టీ ఇన్‌చార్జీలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కారణాల వల్ల పార్టీ అభ్యర్థి ఎల్‌బీ నగర్‌లో మెజార్టీ ఓట్లు సాధించడం పక్కా అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నాడి అంతు చిక్కటుంలేదని, ఓటర్లు ఎక్కడా తమ మనోభావాన్ని, అంతరంగాన్ని బయట పెట్టడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment