వికసించిన కమలం | BJP won maximum 8 MP seats which is its own record | Sakshi
Sakshi News home page

వికసించిన కమలం

Published Wed, Jun 5 2024 5:47 AM | Last Updated on Wed, Jun 5 2024 8:30 AM

BJP won maximum 8 MP seats which is its own record

ఈసారి అత్యధికంగా 8 ఎంపీ సీట్లలో గెలిచి సొంత రికార్డు

ఉమ్మడి ఏపీలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో 

ఏడు ఎంపీ స్థానాల్లో గెలుపే ఇప్పటిదాకా ఆ పార్టీ అధిక స్థానాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా ఇవే మెజారిటీ స్థానాలు. ఈ ఎన్నికల్లో కచి్చతంగా డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తామని అటు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా మొదలు రాష్ట్రనేతలు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ పేర్కొన్నా, రెండెంకెల సీట్లను మాత్రం సాధించలేకపోయింది. అయితే అధికార కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకల్లా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఎదుగుతుందనే ధీమాను ఆ పార్టీనేతలు వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద  బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎంపీగా గెలిచినట్టుగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌  నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.


» 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీచేయగా, జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్‌), అరి్వంద్‌ ధర్మపురి (నిజామాబాద్‌), సోయం బాపూరావు (ఆదిలాబాద్‌)గెలిచారు.  
»  2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో 4 సిట్టింగ్‌ స్థానాలకు తోడు (ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు స్థానంలో గోడెం నగే‹Ù), అదనంగా 4 చోట్ల ఈటల రాజేందర్‌(మల్కాజిగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), ఎం.రఘునందన్‌రావు (మెదక్‌) గెలిచారు.  
»  1980లో బీజేపీ ఏర్పడ్డాక...ఉమ్మడి ఏపీలో జరిగిన 1999 అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో అత్యధికంగా 12 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు (అందులో నాలుగు తెలంగాణ నుంచి) గెలుపొందారు. బీజేపీ గెలిచిన అత్యధిక సీట్లు అవే.  
»    2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందినా...ఇప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో...ఒక్క తెలంగాణ నుంచే అత్యధికంగా 8 ఎంపీ సీట్లలో గెలిచి గత రికార్డులను బ్రేక్‌ చేసింది.  
»  1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండే రెండు సీట్లలో గెలుపొందింది. అందులో ఒకటి ఉమ్మడి ఏపీ హనుమకొండ స్థానం. ఇక్కడి నుంచి మాజీ కేంద్రమంత్రి పీవీ నరసింహారావును చందుపట్ల జంగారెడ్డి ఓడించారు. మరో స్థానంలో గుజరాత్‌లోని మెహసినా నుంచి ఏకే పాటిల్‌ గెలిచారు. 
»  ఉమ్మడి ఏపీలో జరిగిన 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి సికింద్రాబాద్‌ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్‌ నుంచి సీహెచ్‌ విద్యాసాగరరావు, కాకినాడ నుంచి సినీనటుడు కష్ణంరాజు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గెలిచారు. 
»   1999 ఎన్నికల నాటికి టీడీపీ కలిసి బీజేపీ పోటీ చేయగా, సికింద్రాబాద్‌ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్‌ నుంచి సీహెచ్‌ విద్యాసాగరరావు, మెదక్‌ నుంచి ఆలె నరేంద్ర, మహబూబ్‌నగర్‌ నుంచి ఏపీ జితేందర్‌రెడ్డి, రాజమండ్రి నుంచి ఎస్‌బీపీబీకే సత్యనారాయణ, నరసాపురం నుంచి ఉప్పలపాటి కృష్ణంరాజు, తిరుపతి నుంచి వెంకటస్వామి గెలుపొందారు. 

తెలంగాణ వచ్చాక...  
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఎగుడు దిగుళ్లను చవిచూసింది.  
»   2014 అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసింది. 7% ఓట్లతో 5 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లో బీజేపీ గెలుపొందింది. 
»    2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకసీటు గెలిచి 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యింది. ఆ ఎన్నికల్లో కేవలం ఏడుశాతం ఓటింగ్‌ సాధించింది.  
»   2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 4 ఎంపీ సీట్లు గెలుపొంది గణనీయంగా 19 శాతం ఓటింగ్‌ను సాధించి బీజేపీ సత్తా చాటింది. వరుసగా బీజేపీ బలం పుంజుకోవడంతోపాటు అధికార బీఆర్‌ఎస్‌తో నువ్వా నేనా అన్నట్టుగా దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో తలపడి బీజేపీ అభ్యర్థులు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ గెలుపొందారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకొని 12 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.  
»  2020 డిసెంబర్‌లో జరిగిన జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడం ద్వారా బీజేపీ సంచలనం సష్టించింది. అంతకు ముందు ఆ పారీ్టకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య 48కు చేరుకుంది.  
»   ఆ తర్వాత మొదటిసారిగా పార్టీ బీ ఫామ్‌పై టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం (గతేడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో) నుంచి ఏవీఎన్‌రెడ్డి సంచలన విజయం సాధించారు. 
»  2023 నవంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.14 శాతం ఓటింగ్‌తో 8 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించింది.  
»   2024 మేలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 35.08 శాతం ఓటింగ్‌తో 8 ఎంపీ సీట్లలో గెలుపొంది కాషాయ పార్టీ ఆధిక్యతను చాటింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement