
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి.. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంగతి సరే.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పని.. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోని బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.
చదవండి: బండి సంజయ్‌కు చుక్కెదురు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ
‘‘2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో ఈ ఫ్యాక్టరినీ ప్రభుత్వ పరం చేసుకుంటామని మీ చెల్లెలు కల్వకుంట్ల కవిత.. హామీ ఇచ్చారు. ఇన్నేళ్లయినా.. ఈ హామీ ఎందుకు నెరవేరలేదు. దాదాపు 16 వేల ఎకరాల్లో ఏర్పడిన బోధన షుగర్ ఫ్యాక్టరి ఆసియాలోనే అతిపెద్దది. ఈ ఫ్యాక్టరీ మీరు అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే మూతపడింది. ఫ్యాక్టరీకి చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఫ్యాక్టరీ భూములును టీఆర్ఎస్ నేతలే కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని’’ మధు యాష్కీ గౌడ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment