సాక్షి, హైదరాబాద్ : ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే.. కేసీఆర్ చాతకాకనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గౌరవంగా మాట్లాడితే తాము మర్యాదిస్తాం అన్నారు. కాదని తాగుబోతులా మాట్లాడితే తాను కూడా తాగకుండా అదే రేంజ్‌లో తిడతానన్నారు.
పేకాట క్లబ్బులు ముసామని చెబుతున్న కేసీఆర్ పబ్బులు ఎందుకు తెరిచారో చెప్పాలన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. నిస్వార్థంగా సోనియా తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో పాపాత్ముడి పాలన అంతమైందన్నారు. అసెంబ్లీ రద్దుతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌తో కలిసిరావలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment