తెలంగాణపై ఆందోళన వద్దు | don't concern on telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణపై ఆందోళన వద్దు

Published Wed, Jan 29 2014 2:57 AM | Last Updated on Sat, Aug 11 2018 7:51 PM

don't concern  on telangana

కలెక్టరేట్, న్యూస్‌లైన్:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై  తెలంగాణ ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎంపీ మధుయాష్కీగౌ డ్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో టీఎన్జీవోస్ 2014 -డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.   ఎంపీ, టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమా న్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

 ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు , కార్మికులు, కర్షకులు, విద్యార్థులు నిరంతరం పోరాటం చేశారన్నారు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణకోసం అమరులయ్యారన్నారు. వా రి ఆశయం మరో పది, పదిహేను రో జు ల్లో తీరబోతుందన్నారు. ఫిబ్రవరి తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలి చిపోతుందన్నారు.

 ఉద్యమంలో ఉద్యోగులే ముందు
 టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ  ఉద్యమంలో మొదటి నుంచి ఉద్యోగులు ముందు ఉన్నారన్నారు.  సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను మొదటి నుంచి మోసం చేస్తునే ఉందన్నారు. 610 జీవోను పూర్తిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల లక్షా 40 వేల మంది ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుందని స్వయంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో  కాంట్రాక్టు , అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు జీవితాలు బాగుపడతాయన్నారు.  

 కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి, శ్రీనివాసరావు, టీఎన్‌జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం, కార్యదర్శి కిషన్, టీజీఓ అధ్యక్షులు బాబురావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, తెలంగాణ ట్రెజరీ అధ్యక్షుడు రాములు, జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ,  సాయరెడ్డి, టీఎన్జీవోస్ నాయకులు అమృత్‌కుమార్, నరహరి, దయానంద్, నరేందర్, తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement