సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిపై అధికార టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, సీఎం కేసీఆర్‌కు అసలు తెలంగాణ గురించి ఏమీ తెలియదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. రాష్ట్రానికి ఏం కావాలో ఆయనకు అవగాహన లేదన్నారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించారా? అని సోమవారం మధుయాష్కీ ఒక ప్రకటనలో నిలదీశారు.
ఈ ఏడేళ్ల కాలంలో బీజేపీని ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా జాతీయస్థాయిలో బీజేపీకి అండగా నిలిచిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు గల్లీలో నాటకాలు మొదలుపెట్టిందని, కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. వారం రోజుల్లోనే పత్తి క్వింటాల్‌కు రూ.1,000 తగ్గిందని, దీనిపై సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment