సాక్షి, హైదరాబాద్: సొంత బిడ్డల్లాంటి రాష్ట్ర ప్రజల మీద, వారి భవిష్యత్ అవసరాల మీద కనీస ప్రేమలేని పాలకుడు కేసీఆర్ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిందని, కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అవి ప్రజలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అడ్డగోలు పాలనతో దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిలాగా మారే పరిస్థితి ఏర్పడిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ రెండు జిల్లాల ప్రజల కళ్లలో సీఎం మట్టి కొట్టారని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన ప్రాజెక్టులపై కేసీఆర్‌కు పట్టింపు లేదని, ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోలేని ఆయన కాంగ్రెస్ హయాంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment