అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో పూర్తి నిస్తేజం ఆవరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా జోష్ పెరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో పాటు జిల్లా నుంచి సీనియర్ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు ప్రచార కమిటీ చైర్మన్, మహేశ్ కుమార్ గౌడ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కాయి. వీరిద్దరు బుధవారం జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాయి. ఇందల్వాయి నుంచి జిల్లా కేంద్రానికి భారీ బైక్‌లు, కార్ల ర్యాలీ తీయనున్నారు.
సాక్షి, నిజామాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పారీ్టలో గతంలో వివిధ వర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు. అయినప్పటికీ కాంగ్రెస్ పారీ్టకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగా మంచి విజయాలు సా ధిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు సంవత్సరాలుగా నాయకుల్లో, శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ వరుసగా 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ శ్రేణు ల్లో మరింత స్తబ్ధత ఆవరించింది. ఈ క్రమంలో గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింతగా దెబ్బతిన్నది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓ టమిపాలైంది. ఎ
న్నికల్లో ఆమెకు ఉన్న వ్యతిరేక పవనాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మ లుచుకోలేకపోయింది. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గిపోవడంతో పాటు యువతరం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా అనూహ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరి్వంద్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. తరువాత వరుసగా జరిగిన మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పార్టీ మూడో స్థానంలోనే నిలిచింది. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే కేవలం రెండు స్థానాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. పరిస్థి తి ఎలా తయారైందంటే పార్టీ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకే కాంగ్రెస్ నేతలు పరిమితమ య్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల పీసీసీ అ ధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడంతో రాష్ట్రవ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. జిల్లా నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా, మహేష్‌కుమార్ గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవులు ఇవ్వడంతో జిల్లా పారీ్టలోనూ జోష్ వచ్చింది.
ఇద్దరు నేతలు..
పదవులు పొందిన తర్వాత ఇద్దరు నేతలు బుధవారం జిల్లాకు రానుండడంతో ఇందల్వాయి నుంచి నగరంలోని లక్ష్మి కల్యాణ మండపం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టా రు. దీని కోసం గతానికి భిన్నంగా వర్గాలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు కదులుతుండడం గమనార్హం. భారీ ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీ తీయనున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మారిన తరువాత గత మూడు వారా ల్లో మూడుసార్లు చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రైతు సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.
ఇవి గాక గతంలో చెప్పుకోదగిన కార్యక్రమం సైతం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకముందు గత జనవరి 30న ఆర్మూర్‌లో పసుపు రైతుల సమస్యలపై భారీ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అ ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, బీసీ సెల్ జి ల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్ తదితర నాయకుల ఆధ్యర్యంలో ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్ష పదవి రేసు మొదలైంది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment