సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:కాంగ్రెస్ తమ పార్టీ నేతలపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తోందని,తాము తల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. యాదగిరిగుట్టలో బుధవారం(జనవరి22) కవిత మీడియాతో మాట్లాడారు.
‘మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్. మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ ఆనాడే నడుం బిగించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు మూసీని ఏటీఎంగా మార్చుకున్నారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు.
లూటీ చేసిన దాంట్లో నుంచి ఢిల్లీకి కప్పం కట్టే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. అన్ని పథకాల్లో కోతలు పెట్టారు.ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్ చేశారు. నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు.ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన పప్రాజెక్టును బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత చేపట్టినపుడు బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.
కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో పలు చోట్ల ధర్నాలు చేశారు. మూసీ ప్రక్షాళన కంటే తెలంగాణలో ప్రాధాన్యమైన పనులు ఎన్నో ఉన్నాయనేది బీఆర్‌ఎస్ వాదన. దీంతో పాటు ఈ ప్రాజెక్టులో భాగంగా పేదల ఇళ్లు కూల్చవద్దని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: మేయర్‌పై అవిశ్వాసం
Comments
Please login to add a commentAdd a comment