సాక్షి,తెలంగాణ భవన్ : హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధినేత కేసీఆర్ పిలుపుతో తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్‌ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నారు.
ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదు. తెలంగాణ అని మేం హృదయాల్లో రాసుకుంటే రేవంత్ రెడ్డి గన్నులు ఎక్కుపెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాను ఎవరైనా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే కేసులు పెడతామని అంటున్నారు. అయినా సరే హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు. రేవంత్ పెట్టిన విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉంది’అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసిన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో
తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదు. తెలంగాణ తల్లి మన ఉద్యమాల కేతనం, మన స్వాభిమాన సంకేతం. తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీక. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమే.
తెలంగాణ ఆత్మగౌరవంగా నిలిచి స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని… pic.twitter.com/SlpI3W7rc9— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment