మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గం: కవిత
సాక్షి, హైదరాబాద్: ‘పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్క. రేవంత్‌రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిధులు పారితే రేవంత్ పాల నలో తిట్లు పారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడి తిట్ల దండకం చదువు తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం తన నివా సంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు.
‘బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఉ ద్యమ కాలంనుంచి అనేక కష్టాలను తట్టుకుని కార్యకర్తల బలంతో బీఆర్‌ఎస్ నిలబడింది. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారే నిజమైన కా ర్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమ లు చేయని తీరును ప్రజల్లో ఎండగట్టాలి’ అని కవిత దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గమని అన్నారు. అఖిల భార త పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రేపటి నుంచి జాగృతి సమీక్షలు...
ఉమ్మడి జిల్లాల వారీగా ఈనెల 4 నుంచి తెలంగాణ జాగృతి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్లగొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఉంటాయి. 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో కవిత సమావేశమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment