సాక్షి, హైదరాబాద్: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను వెల్లడించిన నేపథ్యంలో ఎమ్మె ల్సీ కవితతో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కవితను ఆమె నివాసంలో కలసిన నేతలు పలు అంశాలపై చర్చించారు.
సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు పెరుగుతాయన్న అంశంపై కవిత వారితో చర్చించారు. బీసీలకు స్థానిక ఎన్నిక ల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment