BC Unions
-
రేపు ‘కులగణన’ సదస్సుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన సాయంత్రం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఇందిరాభవన్‌లో కుల సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు పాల్గొని కులగణన సంప్రదింపుల సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ గంటపాటు అన్ని వర్గాలతో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కులగణన దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ నేతలు రోహిణ్‌రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్.కృష్ణయ్యకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు.. ‘బాబు యవ్వారం విడ్డూరంగా ఉంది’
ముషీరాబాద్ (హైదరాబాద్): తమది బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకునే తెలు గుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వంపై కుట్రలకు తెరలేపడం ఆయన స్థాయికి తగదని పలు బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. గత 4 దశాబ్దాలుగా బీసీల హక్కుల సాధనకు ఉద్యమాలే ఊపిరిగా జీవితం గడుపుతున్న ఆర్.కృష్ణయ్యను.. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వారు దుయ్యబట్టారు. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికైతే బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దూరం అవుతారోననే భయంతోనే చంద్రబాబు విషం కక్కుతున్నారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం జాతీ య బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, ఏపీ యూత్ అధ్యక్షుడు బోన్ దుర్గానరేశ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్కోటితోపాటు పలు సం ఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు ఏనాడూ న్యా యం చేయలేదని, బీసీల పట్ల కపట ప్రేమను ఒలకపోశారని మండిపడ్డారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించిన చంద్రబాబు, ఆ తరువాత టీడీపీ శాసన సభా పక్ష నేతగా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం పదవులు కేటాయిస్తే చంద్రబాబుకు కుళ్లు ఎందుకని ప్రశ్నించారు. కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారడం ఖాయమని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు. -
ఈబీసీ కోటాకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా
-
బీసీలకు 65 శాతం టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటిపార్టీసహా 22 బీసీ సంఘాలు, 64 బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మంగళవా రం అఖిల పక్షాలు, బీసీ సంఘాల సమావేశంలో ఎల్.రమణ(టీడీపీ), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), దిలీప్‌కుమార్(టీజేఎస్), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ), రాజేందర్ (ఎంఐఎం) ప్రసంగించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బీసీలకు 65శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో 60 నుంచి 70 శాతం బీసీ జనాభా ఉందని, బీసీలకు టికెట్లు ఇస్తే వారే గెలుపుగుర్రాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పటికే బీసీ బిల్లుకు మద్దతుగా ప్రధానమంత్రికి లేఖ రాశామన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించినట్టుగా గుర్తుచేశారు. బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో బీసీలకు కేటాయించిన బడ్జెట్లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలకు అన్యా యం చేస్తున్నాయని, ఇది సరైన విధానం కాదని విమర్శించారు. టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ పదవుల్లో తమ పార్టీ ఇప్పటికే బీసీలకు 50శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గొరిగే మల్లేశ్, నీల వెంకటేశ్, రమ్య, వేముల రామకృష్ణ, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు
ఉయ్యూరు: టీడీపీలో చైర్మన్‌పై అవిశ్వాస వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జంపాన పూర్ణచంద్రరావు (పూల)కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనతో టీడీపీ పరువు రోడ్డున పడింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించే జంపాన కుటుం బం బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కి చంద్రబాబు, ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే బోడె, ఎమ్మెల్సీ వైవీబీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో కౌంటర్‌గా టీడీపీ ముఖ్యనేతలు మీడియా సమావేశం పెట్టి సమర్ధించుకునే పనిలోపడ్డారు. అయితే చైర్మన్ పూల తిరుగుబాటు జెండా ఎగురవేయడం, టీడీపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే చర్చ జరుగుతోంది. ప్రదర్శన అడ్డగింపు.. ఉద్రిక్తత! మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు (పూల)పై అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ శ్రేణులతో పాటు ఆ సంఘ నాయకులు ర్యాలీకి ఉపక్రమించారు. సమాచారం అందుకున్న పోలీసులు చైర్మన్‌ను కలిసి ర్యాలీకి అనుమతి లేదని, సమావేశాన్ని తన అపార్ట్మెంటులోనే నిర్వహించుకుని మీడియాతో మాట్లాడుకోవాలని విన్నవించారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు అక్కడకు చేరుకుని శాంతియుత ప్రదర్శనకు అనుమతి ఏంటంటూ చైర్మన్‌తో కలిసి రోడ్డెక్కారు. సీఐ సత్యానందం నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ప్రదర్శనగా వెళ్లకుండా పూల మద్దతుదారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాదులాటలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై బీసీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో చివరకు సెంటర్ వరకు ప్రదర్శనను అనుమతించకతప్పలేదు. బీసీల సత్తా చూపుతాం బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఆ వర్గాలకే టీడీపీ అన్యాయం చేస్తుందని టీడీపీకి చెందిన చైర్మన్ పూల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చైర్మన్‌గా పీఠమెక్కించి నాలుగేళ్లు నరకం చూపించారు. ఏ ఒక్కరోజు నన్ను పాలన చేసుకోనివ్వలా.. అన్నీ అవాంతరాలే.. ప్రతి పనికీ ఎమ్మెల్యే అనుమతంటూ ఇబ్బందులు పెట్టారు.. నా సొంత నిర్ణయమంటూ ఏమీ లేదు.. టీడీపీ ముఖ్యనాయకులే పాలించుకున్నారు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలోనే ఉంటే నాపై అవిశ్వాసం పెట్టి దింపేస్తానంటారా.. ఇదేనా బీసీలకు టీడీపీలో జరిగే న్యాయం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లాలో ఏ గౌడ కులస్తులను ఎదగనివ్వరన్నారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావును అణగదొక్కినట్లే తనను కూడా ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపైనా విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం వెనక్కి తీసుకోకుంటే రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపుతామన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి ఖుద్దూస్‌కు చైర్మన్ ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబూ.. ఖబడ్దార్.. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శొంఠి నాగరాజు మాట్లాడుతూ, బీసీల జోలికొస్తే ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. టీడీపీలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల పేరు చెప్పుకుని గద్దెనెక్కి బీసీ చైర్మన్‌పైనే అవిశ్వాసం పెట్టిస్తావా అని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అవిశ్వాసం వెనక్కు తీసుకోకుంటే 2019 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పూలను బరిలోకి దించి టీడీపీని ఓడిస్తామని స్పష్టం చేశారు. -
కలెక్టర్ బదిలీ అయ్యేంత వరకు ఉద్యమం
– బీసీ సంఘాల హెచ్చరిక కర్నూలు(అర్బన్): అధికార దర్పంతో జిల్లాలో నియంతగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను జిల్లా నుంచి బదిలీ చేసేంత వరకు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. జిల్లాలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా, కలెక్టర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. లక్ష్మినరసింహ, ఉపాధ్యక్షుడు టీ. శేషఫణి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్‌ను కలవాలని బంగ్లా వద్ద వేచివున్నా, పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయన నిరంకుశ వైఖరిని ఎత్తి చూపుతున్నదని వారు నినదించారు. ప్రజల బాధలను పట్టించుకోని కలెక్టర్ తమకు వద్దన్నారు. ఆయన విధుల్లోకి చేరినప్పటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ నెల 14న కలెక్టరేట్లో రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి కోరతామన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబు, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ నాయకులు దేవపూజ ధనంజయాచారి, సింధు నాగేశ్వరరావు, జలం శ్రీను, బహుజన సేవా సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు, విజయ్‌కుమార్, మారెప్పయాదవ్, కృష్ణమూర్తి యాదవ్, బాలసంజన్న, దండు శేషుయాదవ్, మద్దిలేటియాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం
బీసీ నేతల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 52 శాతం జనాభా ఉన్న బీసీలకు ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టకపోగా ఇప్పటికే ఉన్న పథకాలకు మంగళం పాడే కుట్రలు చేస్తున్నారని వివిధ బీసీ సంఘాలు ఆరోపించాయి. పెట్టిన ప్రతి పథకంలోనూ బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తాయి. బుధవారం బీసీభవన్‌లో టీఆర్ఎస్ రెండేళ్ల పాలన పై బీసీల ‘చార్జీషీట్’ను ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, సి.రాజేందర్, అశోక్‌గౌడ్, నీల వెంకట్ విడుదల చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పేరుకే అసెంబ్లీలో తీర్మానం చేశారు కాని దాని అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించలేదని, మూడుఎకరాల భూపంపిణీని బీసీలకు వర్తింపచేయలేదని, పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీలు ప్రకటించి బీసీలను విస్మరించారని, విదేశాల్లో ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయంలోనూ బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని 28 అంశాలతో చిట్టాను ప్రకటించారు. -
కలెక్టరేట్ వద్ద బీసీ సంఘాల ధర్నా
శ్రీకాకుళం టౌన్ : కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబి తాలో చేర్చాలంటూ సాగుతున్న ఉద్యమానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు గళం విప్పాయి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కాపులను బీసీలో చేరిస్తే ప్రస్తుతం ఉన్న కోటాను పెంచాలని లేకుంటే ప్రస్తుతం బీసీల జాబితాలో ఉన్న కులాలకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2004నాటికి బీసీల జాబితాలో 94 కులాలు చేరిస్తే ఇప్పుడు 160 కులాలు అందులో చేరాయని, రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా కొత్తగా కులాలు చేరడం వల్ల బీసీల్లో పోటీ పెరిగి రిజర్వేషన్ పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 27శాతం రిజర్వేషన్ మాత్రమే బీసీ ఉప కులాలకు రిజర్వేషన్ కల్పిస్తుండడం వల్ల ప్రయోజనం పొందలేక పోతున్నామన్నారు. రిజర్వేషన్ శాతాన్ని 50కి పెంచి మరికొన్ని కులాలు చేర్చినా ఇబ్బంది ఉండదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఉప కులాలను దెబ్బతీసే విధంగా బలమైన సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చడం వల్ల అన్యాయం జరుగుతుందన్న ఆందోళనబీసీ వర్గాల్లో ఉందని చెప్పారు. ధర్నాలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.పి.దేవ్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయిన గోవిందరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
అనంత కలెక్టరేట్ ముట్టడి
కాపులను బీసీలో చేర్చొద్దని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక కార్యకర్తలు గురువారం అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కాపులను బీసీలలో చేర్చితే మహా ఉద్యమం చేపడుతామని ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బీసీ క్రీమీలేయర్‌ను రద్దుచేయాలి
వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్ వర్తింపజేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వివిధ రాజకీయ పక్షాలు, బీసీ విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందుకోసం ఈనెల 27న అన్నిజిల్లాల్లో ధర్నాలు, 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం దిగిరాకపోతే రాజకీయపార్టీలు, సంఘాలను సంప్రదించి రాష్ర్ట బంద్ నిర్వహిస్తామని హెచ్చరించాయి. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీలకు క్రీమీలేయర్ అమలు చేయడం పెద్ద కుట్ర అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాయ మాటలతో మభ్యపెట్టి, కుటిల రాజకీయాల్లో సిద్ధహస్తుడైన మాకియవెల్లీ కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు ఓడిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గండికొట్టేందుకే క్రీమీలేయర్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. హిజ్రాలను బీసీల్లో కలపడం అవమానకరమని, ఓసీల్లో చేర్చితే వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని వ్యాఖ్యానించారు. నిద్ర నటిస్తున్న కేసీఆర్‌కు బీసీల ఉద్యమం ద్వారా వాత పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకుంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగలకుండా ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. సామాజిక అంశాన్ని ఆర్థిక అంశంగా విడదీసే కుట్ర జరుగుతోందని టీటీడీపీ అధికారప్రతినిధి అరవింద్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల తేనెతుట్టె కదిపితే గతంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే యాగాలు కాదు సమాధి కడతారని తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, బీసీ నేత నారగోని, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, బీసీ ఉద్యో గ, మహిళ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు నిరంజన్, గుజ్జ కృష్ణ, శారదాగౌడ్, ర్యాగ రమేశ్, నీల వెంకటేశ్, విక్రమ్‌గౌడ్, వెంకన్న, బైరి నరేశ్, సాంబశివ పాల్గొన్నారు.