
ఎస్సై జోషికి ఫిర్యాదు చేస్తున్న ప్రియాంక, సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి
సాక్షి, కంబాలచెరువు (తూర్పు గోదావరి): ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఒలీవల మందిరం పాస్టర్ షారోన్ కుమార్ తనను మోసం చేశాడని కడియం మండలం రెడ్డిపడల్లి గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రింయాక మంగళవారం రెండోపట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఒలీవల చర్చికి వెళ్తోంది. అక్కడ పాస్టర్ షారోన్ కుమార్ ఏకాంత ప్రార్థనలను ప్రోత్సహించేవాడు.
తన భార్యతో విడాకులు అయిపోతున్నాయని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి తనవద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలను బహిర్గతం చేస్తానని భయపెడుతున్నాడు. దీంతో కొందరి సహకారంతో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణిని కలిసి తన బాధ చెప్పుకున్నానని, ఆమె ధైర్యంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని ప్రియాంక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment