
ఆ శిశువును దత్తత తీసుకుంటా..
‘సాక్షి’కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సినీనటి కరాటే కల్యాణి
సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ముళ్లపొదల్లో పడేసిన ఆడశిశివును పత్రికల్లో, సోషల్ మీడియాలో చూసిన సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు. ‘సాక్షి’కి ఫోన్ చేసి పాప వివరాలు తెలుసుకున్నారు. ఆ పాపను తనకిస్తే దత్తత తీసుకుంటానని, ఇందుకోసం కలెక్టర్‌తోనూ మాట్లాడతానని పేర్కొన్నారు.