టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె రిలీజ్ చేసిన ఒకపరి పాట పెద్ద వివాదంగా మారింది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి స్పందించింది.
'శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు. ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు. కె.విశ్వనాథ్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు నేను పుట్టలేదు. వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే! భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!' అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. మరోవైపు ఏదేమైనా సాంగ్ డిలీట్ చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు ఆ పాటను తొలగించడం గమనార్హం.
చదవండి: నా జీవితంలో ఆనందం, ప్రశాంతత లేకుండా పోయాయి
మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల
Comments
Please login to add a commentAdd a comment