arpitha
-
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
అర్పిత ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల కుంభకోణం దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకేం సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెప్తుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ చెప్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైంలో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారంటూ ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ తరుణంలో.. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఈడీ బయటపెట్టింది. అర్పితా ముఖర్జీకి చెందిన దాదాపు 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలలో నామినీగా పార్థ ఛటర్జీ పేరు ఉందని ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నిందితులిద్దరూ నగదు రూపంలోనే చేశారు. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉంది అని దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది కూడా. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ సతీమణికి ఈడీ సమన్లు -
అర్పిత.. స్ఫూర్తి ప్రదాత
మొన్నటి ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు, ఇతర పతకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతోన్న పారా ఒలింపిక్స్‌లోనూ మేమేం తక్కువ కాదన్నట్లు ... పారా ఒలింపిక్ క్రీడాకారులు మరింత కసితో ఆడుతూ ప్రతి ఆటలో పతకాన్ని ఖాయం చేస్తున్నారు. వైకల్యాలకు ఎదురొడ్డి పోరాడుతూ పతకాల సంఖ్యను పెంచుతున్నారు. అయితే వీళ్లలా ఆ స్థాయికి వెళ్లనప్పటికీ, రెండు కాళ్లు కోల్పోయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన అర్పితా రాయ్ మొక్కవోని ధైర్యంతో కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకుని యోగా ట్రైనర్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అది 2006 ఏప్రిల్ 22 కోల్‌కతాలో కొన్ని వస్తువులు కొనేందుకు తన ఫ్రెండ్ బైక్ మీద కూర్చుని వెళ్తోంది అర్పితా రాయ్. బ్యారక్‌పూర్‌లోని తన ఇంటి నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాక.. ఒక సెకను లో అర్పిత జీవితం అనూహ్యంగా తలకిందులైపోయింది. ఒక పెద్ద లారీ వచ్చి వారి బైక్‌ను గుద్దింది. ఆ స్పీడుకు అర్పిత కిందపడిపోవడం... ఆమె కాళ్ల మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో... ఆమె కాళ్లు నలిగిపోయాయి. ఆ దరిదాపుల్లో ఉన్న వారు వచ్చి రోడ్డుకు అవతలివైపు ఉన్న ఆసుపత్రిలో అర్పితను చేర్చారు. అక్కడ పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇచ్చి, శస్త్రచికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించమన్నారు. వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తే కాళ్లు వస్తాయని డాక్టర్లు చెప్పినప్పటికీ ... అర్పిత తల్లిదండ్రుల వద్ద ఆ సమయంలో ఆపరేషన్‌కు సరిపడా డబ్బులు లేక, వాటిని సమకూర్చుకోవడానికి 12 రోజుల సమయం పట్టింది. దీంతో కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి రెండు కాళ్లను తీసేశారు. అంతేగాక ఎనభైశాతం శరీరానికి గ్యాంగ్రిన్ సోకడంతో నాలుగు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉంది. తన కాళ్లమీద తాను నిలబడి ధైర్యంగా బతకాల్సిన 20 ఏళ్ల అమ్మాయి రెండు కాళ్లనీ కోల్పోయింది. అయినప్పటికీ కృత్రిమ కాళ్లను అమర్చుకుని తను ఎవరి మీదా ఆధారపడ కూడదని నిర్ణయించుకుంది. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ పదిహేనేళ్లు. ఇప్పుడు అర్పిత కృత్రిమ కాళ్లతో నడవడమేగాక, యోగా కూడా చేస్తుంది. రోజూ గంట నిల్చొని... ఆపరేషన్ తరువాత రోజూ గంటపాటు నిలుచోమని డాక్టర్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల శరీర ఆకృతి కరెక్టు వస్తుందని చెప్పడంతో అలా చేసేందుకు ప్రయత్నించేది. దాని వల్ల అర్పితకు చాలా నొప్పిగా అనిపించేది. అయినప్పటికీ అంతటి నొప్పిని ఓర్చుకుని, అనేక ప్రయత్నాల తరువాత తన కాళ్ల మీద తను నిలబడింది. నడవడం నేర్చుకున్న తరువాత 2007లో కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది. రెండున్నరేళ్లు పనిచేసి, పెళ్లి అవడంతో ఉద్యోగం మానేసింది. యోగా ట్రైనర్‌గా... కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు సహోద్యోగులు చూసే చూపులు తనని తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. మెట్టు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా కష్టంగా అనిపించేది. ఈ క్రమంలోనే యోగా చేయడం ద్వారా శరీరాన్ని బ్యాలెన్స్‌గా ఉంచడమేగాక, ఫిట్‌గా ఉండవచ్చని భావించి 2015లో యోగా చేయడం ప్రారంభించింది. తొలిదినాలలో యోగా చేయడం బాగా కష్టంగా అనిపించినప్పటికీ కఠోర శ్రమపడి నేర్చుకుంది. ఆసనాలు పర్ఫెక్ట్గా వేయడం వచ్చాక... 2019 లో తనే ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది. కరోనా రాకముందు 25 మందికి ఆసనాలు వేయడం నేర్పించేది. వీరిలో వికలాంగులు కూడా ఉన్నారు. యోగా ట్రైనర్‌గా అర్పితకు మంచి గుర్తింపు రావడంతో తన యోగా క్లాసుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రారంభించింది.‘రాయ్ అర్పితా యోగా’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన యోగా ట్రైనింగ్ సెషన్స్‌తో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోలకు ప్రోత్సాహంతో కూడిన కామెంట్లు వస్తుండడంతో అర్పిత మరింత ఉత్సాహంతో దాదాపు ఆరేళ్లుగా యోగా తరగతులు చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
ప్రపంచసుందరివి కావాలి
భువనేశ్వర్: అర్పిత బెహరా ప్రపంచ సుందరి కావాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు. సంబల్పూర్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న అర్పిత బెహరా లిటిల్ మిస్ గెలాక్సీ –2018 పురస్కారం సాధించింది. ఈ పోటీలు బల్గేరియాలో ఇటీవల ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. 12 నుంచి 14 ఏళ్లలోపు వర్గంలో ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక టైటిల్ సాధించడంపట్ల నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. 2012లో మిస్ సంబల్పూర్గా మిస్ సంబల్పూర్ టైటిల్‌ను అర్పిత బెహరా 2012లో గెలుచుకుంది. ఆ ప్రేరణతో ఇంత వరకు ఎదిగింది. భవిష్యత్తులో ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు అర్పిత బెహరా తెలిపింది. -
శిక్షలు తెలిస్తే నేరాలు చేయరు
మాడ్గుల: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేరాలపై అవగాహన పెంచుకుంటే తప్పులు చేయడానికి వెనకాడతారని కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్ వై.వెంకటేశ్వర్లుగౌడ్ అధ్యక్షతన న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సులో జడ్జి అర్పితమారంరెడ్డి, అదనపు జడ్జి భవాని, పలువురు న్యాయవాదులు చట్టం, న్యాయం, ధర్మం, బాల్య వివాహాల నిõషేధం, ప్రమాదాల నివారణ, ఇన్సూరెన్స్, రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఆస్తి తగాదాలు, రిజిస్ట్రేషన్లు, చెక్కులు, ప్రామిసరీ నోటు, జనన, మరణాలపై ప్రజలకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. ఏ నేరం చేస్తే ఏ శిక్ష పడుతుంది..శిక్షల వల్ల కుటుంబాల జీవన పరిస్థితి ఎలా మారుతుంది..అనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు వెంకట్‌నారాయణగౌడ్, న్యాయవాదులు ఏర్పుల రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, జానకిరాములు, వెంకట్‌రెడ్డి, యాదిలాల్, మహేశ్,మల్లేష్, జయంత్, వెంకట్రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అదిరె.. కళ్లు చెదిరె..
అంగరంగ వైభవంగాసల్మాన్ఖాన్ సోదరి వివాహం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా వేడుక అర్పితాఖాన్, ఆయుష్ శర్మ జంటను ఆశీర్వదించిన అతిథులు హాజరైన అమితాబ్, రజనీకాంత్, ఆమిర్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కత్రినా సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారల సందడితో హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ మరింత మెరిసిపోయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్యాలెస్‌లో అంతకంటే ముచ్చటగా తయారైన పెళ్లి జంట అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు వివాహ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. పెళ్లి కుమారుడు ఆయుష్ శర్మ బ్యాండ్ బాజాలతో గుర్రంపై బారాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. వధువు తండ్రి సలీంఖాన్, తల్లి సల్మాఖాన్, సోదరులు సల్మాన్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సొహేల్ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు వరుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంజాబీ సంప్రదాయ పద్ధతిలో అర్పిత, ఆయుష్ శర్మ వివాహం జరిగింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్రనటులు ఆమిర్‌ఖాన్, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, కత్రినాైకైఫ్, కాజల్, కరణ్ జోహార్, బాబాసెహగల్తో పాటు క్రికెటర్ అజారుద్దీన్ వంటి సుమారు 250 మంది ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులంతా వధూవరులను ఆశీర్వదించారు. వారందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజాం వంటకాలతో విందు పెళ్లి విందులో నిజాం వంటకాలను అతిథులంతా పసందుగా ఆరగించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని 101 సీట్ల డైనింగ్హల్లో దక్కన్ బిర్యానీ, హలీమ్, పత్తార్కా ఘోష్, డబల్కా మీఠా తదితర వంటకాలు వడ్డించారు. విందు అనంతరం ప్రసిద్ధ కళాకారుల కళా ప్రదర్శనలు కొనసాగాయి. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మైకా, యోయో హోనిసింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫలక్‌నుమాలో సందడి అర్పిత వివాహం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం నుంచే సల్మాన్ ఖాన్ బంధుమిత్రులు, అతిథుల రాకతో హడావుడిగా మారింది. మీడియాను ప్యాలెస్ ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. మద్యాహ్నం రెండు గంటల ప్రాంత ంలో సల్మాన్ ఖాన్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. వివాహానంతరం రాత్రి ఎనిమిది గంటలకు ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియో గ్రాఫర్లను అనుమతించారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు కూడా ప్యాలెస్ వద్దకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. రంగురంగుల విద్యుల్లతలతో ఫలక్‌నుమా ప్యాలెస్ జిగేల్మంది. బుధవారం పెళ్లి విందుతో వివాహ వేడుక ముగియనుంది. ఫూట్‌పాత్‌పై నుంచి ప్యాలెస్ వరకు.. దిక్కుమొక్కు లేక రోడ్డు పక్కన పూట్పాత్పై లభించిన అనాథ బాలికను అల్లారుముద్దుగా యువరాణిలా పెంచింది సల్మాన్ ఖాన్ కుటుంబం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే కోట్లు కుమ్మరించి మరీ చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిపించింది. యాక్సిడెంట్లో తల్లి మృతి చెందడంతో అనాథగా రోడ్డుపక్కన పడి ఉన్న బాలిక అర్పితను సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అక్కున చేర్చుకున్నారు. ఆమెను దత్తత తీసుకుని యువరాణిలా పెంచారు. అర్మితకు తన వివాహం ప్యాలెస్‌లో జరగాలని కోరిక. దీంతో ఆమె కోరికను తీర్చేందుకే సల్మాన్ కుటుంబం సుమారు రూ. 2 కోట్లు ఖర్చుచేసింది. ఆరు నెలల క్రితమే ఫలక్‌నుమా ప్యాలెస్‌ను బుక్ చేశారు. ఇక ముంబైలోని కార్టర్రోడ్డులో సుమారు రూ. 16 కోట్ల విలువైన మూడు పడక గదుల ఫ్లాట్‌ను సల్మాన్‌ఖాన్ తన సోదరికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో అర్పిత డిగ్రీ చదివారు. ఇటీవలే ఆమె సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్‌ను లాంచ్ చేసింది.