కోల్‌కతా: నాలుగు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల చిన్నారిని పాడుబడిన బిల్డింగ్‌లోకి తీసుకెళ్లి అత్యంత పాశవీకంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు దుండగులు. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక గత బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో చిన్నారి బంధువులు తన కోసం వేతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలిక బంధువుల ఇంటికి సమీపంలోని ఓ పాడుపడిన బిల్డింగ్‌లో చిన్నారిని గుర్తించారు.
బాలికకు ఒంటి మీద బట్టలు సరిగా లేవు.. గొంతు కోశారు.. చిన్నారి పళ్లు ఉడిపోయాయి. బాధితురాలిని ఈ స్థితిలో గమనించిన పోలీసులు.. చిన్నారి మృగాళ్ల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎంతో పెనుగులాడి ఉంటుందన్నారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టిన వారు బాధితురాలికి తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక తమను గుర్తుపడుతుందనే ఉద్దేశంతోనే నిందితులు చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇక దారుణంపై నెటిజనులు విపరీతంగా మండిపడుతున్నారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్‌లో ‘‘జస్టిస్‌ఫర్‌ఖుషి’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందించకపోవడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మమత రాజ్యంలో ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది’’.. ‘‘సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడుకునే రోజులు పోవాలని కోరుకుంటున్నాం’’.. ‘‘మనం ఎటువైపు వెళ్తున్నాం.. హింసకు ముగింపు లేదా’’.. ‘‘ఈ దేశంలో మహిళలకు భద్రత లభించాలంటే ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి.. ఎంత మంది ఆడకూతుళ్లు బలవ్వాలి’’ అంటూ నెటిజనులు విరుచుకుపడుతున్నారు.
చదవండి: అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను
Comments
Please login to add a commentAdd a comment