
హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) అంత్యక్రియలు శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. నగరంలోని రామస్వామి నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానం వరకు ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఆయన కుమారుడు శ్రీనివాస్ మహాప్రస్థానంలోని విద్యుత్ దహన వాటికలో తండ్రి భౌతిక కాయాన్ని దహనం చేశారు. అంతకుముందు పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ఆర్‌డీఓ చంద్రకళ, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ రామయ్య, జస్టిస్ రామస్వామి కూతుళ్లు జ్యోతి, డాక్టర్ జయ, బంధువులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment