
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారులకు జీవితకాలమంతా సాయం అందాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. దివ్యాంగ చిన్నారుల హక్కుల పరిరక్షణపై 9వ వార్షిక జాతీయ సదస్సులో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘ దేశంలో ఎంతమంది దివ్యాంగ చిన్నారులు అనే కచి్చతమైన గణాంకాలే లేకపోవడం దారుణం. దివ్యాంగ చిన్నారులందరికీ శాశ్వతంగా సహాయం, విద్య అందాలి. మనం చొరవ తీసుకుని వారిని పరిరక్షించలేకపోతే దివ్యాంగ చిన్నారులు నిరాదరణకు గురవుతారు.
భిన్న ప్రాంతాల్లోని దివ్యాంగ చిన్నారుల సంక్షేమానికి విభిన్న పద్ధతుల్లో కృషి జరగాలి. అందరినీ ఒకే గాటినకడితే వారిపై వివక్ష చూపినట్లే లెక్క. ఇంతటి కీలక పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు అంగన్‌వాడీలకు తగు శిక్షణ ఇప్పించి, అక్కడి వనరులను పెంచాలి. నిర్బంధ విద్య అమలు అనే దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయకూడదు. కచి్చతంగా దానిని అమలుచేయాలి. తద్వారా ప్రతి ఒక్క దివ్యాంగ విద్యారి్థకి విద్య అందించాలి’’ అన్నారు. దివ్యాంగ చిన్నారులకు పెన్షన్ శాశ్వతంగా అందేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్‌కు న్యాయమూర్తి సూచించారు.