How Paneer Help In Weight Loss
బరువు తగ్గడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అందుకోసం చాలా రకాల కసరత్తులు కూడా చేసేస్తుంటాం. ఫిట్‌నెస్ కోసం ఇష్టమైన ఆహారం కూడా దూరం పెట్టేస్తా. కొందరైతే భోజనమే తినడం మానేస్తారు. లావుగా ఉన్నామన్నా ఫీల్‌తో ఇంతలా కష్టపడుతుంటారు చాలామంది. అయితే నిపుణులు బరువు తగ్గాలనుకుంటే ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో! సరైన డైట్ ఫాలో అవ్వడం అనేది అన్నింటికంటే ప్రధానం అని చెబుతున్నారు. నచ్చిన ఆహారం తినకుండా ఉండడం అనేది చాలా కష్టం.
కానీ అందుకోసం మరీ నోటిని కట్టేసినట్లు ఉంచుకోనక్కర్లేదంటున్నారు. నచ్చినవి మితంగా తింటూ డైట్ ఫాలో అవ్వండి. పాటిస్తున్న డైట్‌ని మన మనసు కూడా ఇష్టంగా ఆస్వాదించేలా ఉండటం అనేది కూడా ముఖ్యమే. అయితే ఆరోగ్య నిపుణులు పనీర్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి పనీర్ డైట్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఏంటీ..? పనీర్‌తో బరువు తగ్గగలమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.
ఎలా తగ్గొచంటే..
- పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12, సెలీనియ, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడంలో ఉపకరిస్తాయని అంటున్నారు నిపుణులు.
- ఆరోగ్య మార్గంలో బరువు తగ్గేందుకు ఈ పనీర్ ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు.
- పనీర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర పాల ఉత్పత్తులు కంటే మెరుగైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు.
- కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే పనీర్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడం నివారించొచ్చు.
(చదవండి: భారత రెస్టారెంట్‌కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్‌గా అరోరా)
Comments
Please login to add a commentAdd a comment