భారత్‌ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! | India Sent 38 Tonnes of Food Medical Equipment to Gaza | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు!

Published Wed, Oct 25 2023 9:45 AM | Last Updated on Wed, Oct 25 2023 10:58 AM

India Sent 38 Tonnes of Food Medical Equipment to Gaza - Sakshi

ఇజ్రాయెల్‌ దాడులకు తీవ్రంగా నష్టపోయిన గాజాకు 35 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను భారత్‌ అందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘పాలస్తీనాతో సహా మధ్యప్రాచ్యంలో పరిస్థితి’ అనే అంశంపై జరిగిన చర్చలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్‌ నేషన్‌ డిప్యూటీ పర్మినెంట్‌ రిప్రజెంటివ్‌(డీపీఆర్‌) ఆర్‌ రవీంద్ర మాట్లాడారు. 

ఇజ్రాయెల్ నుంచి ప్రతీకారాన్ని ఎదుర్కొంటున్న గాజా స్ట్రిప్‌కు భారతదేశం అండగా నిలుస్తుందన్నారు. భారత్‌ తరపున 38 టన్నుల ఆహార పదార్థాలు, ముఖ్యమైన వైద్య పరికరాలను గాజాకు పంపినట్లు తెలిపారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించాలని, ప్రత్యక్ష సంభాషణల పునరుద్ధరణకు కృషి చేయాలని ఆయా దేశాలను కోరుతున్నామన్నారు.

అక్టోబరు 7న హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్.. గాజాపై బాంబు దాడులను కొనసాగించింది. ఈ నేపధ్యంలో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఉగ్ర దాడిని భారతదేశం నిర్ద్వంద్వంగా ఖండించిందని రవీంద్ర తెలిపారు. గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తొలుత సంతాపాన్ని వ్యక్తం చేసిన  ప్రపంచ నేతలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఆయన పేర్కొన్నారు. 

ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించారని,  గాజాలోని అల్ హాలీ ఆసుపత్రిలో విషాదకర వాతావరణం నెలకొన్నదన్నారు. బాధిత కుటుంబాలకు భారత్‌ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని, బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. 
ఇది కూడా చదవండి: స్కై బస్సు సర్వీస్‌ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement