చిన్నారికి పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి పెద్ద కష్టం

Published Wed, Oct 4 2023 12:18 AM | Last Updated on Wed, Oct 4 2023 12:57 PM

- - Sakshi

ఈ ప్రమాదంలో తల్లిదండ్రులకు స్వల్పగాయాలు కాగా బిందుశ్రీకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆత్మకూరురూరల్‌(మర్రిపాడు) : మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి గ్రామానికి చెందిన రమేష్‌, రత్నమ్మ దంపతులకు మూడేళ్ల బిందుశ్రీ కుమార్తె సంతానం. కాగా వీరు నెల రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు వద్ద వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులకు స్వల్పగాయాలు కాగా బిందుశ్రీకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం చైన్నె ఆపోలో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. కాగా చిన్నారికి మెదడుకు సంబంధించి రక్తనాళాలు చిట్లిపోయాయని, ఆపరేషన్‌ చేయాలని సూచించారు. నిరుపేదలైన తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద అప్పుచేసి రూ.20 లక్షలకుపైగా చిన్నారి వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ మరో రూ.12 లక్షలు చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమని, దాతలు సాయం చేయాలని కోరుతున్నారు.

సాయం చేయాలనుకుంటే సంప్రదించాల్సిన నంబర్‌ – 70956 56091

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement