
వైఎస్సార్‌సీపీపై అనుచిత వ్యాఖ్యలు
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్‌సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి, యష్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు. మంగళవారం వారు నెల్లూరులోని బాలాజీనగర్ ఎస్సై విజయ్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేయిస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీపై అనుచిత వ్యాఖ్యలు, నేతల, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూరల్ పోలీస్ స్టేషన్‌లో..
నెల్లూరు సిటీ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్త పోస్టు పెట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం పోలీస్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ ఫొటోను మార్ఫింగ్ చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. మహిళలను కించపరిచేలా ఐటీడీపీ వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్‌రావు, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ సింగ్, వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ – పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు కనకట్ల మోహన్‌రావు ముదిరాజ్, 26వ డివిజన్ నాయకుడు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ సోషల్ మీడియా
యాక్టివిస్ట్‌లపై చర్యలకు వినతి

వైఎస్సార్‌సీపీపై అనుచిత వ్యాఖ్యలు