దసరాకు ప్రత్యేక రైళ్లు | Special trains for Dussehra | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక రైళ్లు

Published Fri, Oct 20 2023 3:53 AM | Last Updated on Fri, Oct 20 2023 3:53 AM

Special trains for Dussehra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్‌–సంత్రాగచ్చి (07645/07646) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 20న ఉదయం 8.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి సంత్రాగచ్చి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 21వ తేదీ మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07062) ఈ నెల 22వ తేదీ రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి నర్సాపూర్‌ చేరుకుంటుంది. నాందేడ్‌–కాకినాడ (07055/07056) స్పెషల్‌ ట్రైన్‌ 21వ తేదీ మధ్యాహ్నం గం.3.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 22వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాందేడ్‌ చేరుకుంటుంది. విశాఖపట్టణం–కర్నూల్‌ (08585/08586) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 24, 31, నవంబర్‌ 7, 14 తేదీల్లో సాయంత్రం 5.35కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, నవంబర్‌ 1, 8, 15 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి విశాఖ చేరుకుంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement