
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మరిన్ని ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటి వివరాలు, వేళలు ఇవీ..
కాచిగూడ–మైసూరు: ఈ నెల 20 నుంచి నవంబర్ 29 వరకు డెయిలీ సర్వీసు. కాచిగూడలో రాత్రి 7.05కు బయలుదేరి మరుసటి ఉదయం 9.30కి మైసూరు చేరుకుంటుంది. (21 నుంచి) మైసూరులో సాయంత్రం 3.15కు బయలుదేరి మరుసటి సాయంత్రం 5.40కి కాచిగూడ చేరుతుంది. ఇది జడ్చర్ల, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది.
హైదరాబాద్–జైపూర్: సోమ, బుధవారాల్లో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 25 వరకు. హైదరాబాద్‌లో రాత్రి 8.35కు బయలుదేరుతుంది.
జైపూర్–హైదరాబాద్: బుధ, శుక్రవారాల్లో ఈ నెల 23 నుంచి నవంబర్ 27 వరకు. ఈ ప్రత్యేక రైలు జైపూర్‌లో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్ మీదుగా ప్రయాణిస్తుంది.
హైదరాబాద్–రాక్సౌల్: ఈ ప్రత్యేక రైలు ఈ నెల 22 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది హైదరాబాద్‌లో రాత్రి 11.15కు బయలుదేరుతుంది.
రాక్సౌల్–హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది రాక్సౌల్‌లో తెల్లవారుజామున 3.25కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.
బరౌనీ–ఎర్నాకుళం: ఈ ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. ఇది బరౌనీలో రాత్రి 10.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
ఎర్నాకుళం–బరౌనీ: ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ఆదివారాల్లో నడుస్తుంది. ఎర్నాకులంలో ఉదయం 10.15కు ప్రారంభమవుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్: ఈ నెల 23 నుంచి శుక్ర, సోమవారాల్లో విశాఖలో ఉదయం 8.20కి బయలుదేరుతుంది. వరంగల్, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.
నిజాముద్దీన్–విశాఖపట్నం: ఇది ఈ నెల 25 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీలో ఉదయం 5.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
చదవండి: దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment