సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
నిజామాబాద్– వరంగల్ స్పెషల్ ట్రైన్
నిజామాబాద్– వరంగల్ (07019) ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి వరంగల్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుతుంది. అదే విధంగా వరంగల్–నిజామాబాద్ (07020) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుతుంది. వరంగల్– నిజామాబాద్ మధ్య ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట జంక్షన్, పెండ్యాల్, ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగామ, ఆలేరు, వంగపల్లి, భువనగిరి, బీబీనగర్, ఘట్‌కేసర్, చర్లపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, మనోహరబాద్, వదిరాం, మిర్జాపల్లి, అక్కన్నపేట, కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ స్పెషల్ ట్రైన్
సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ ప్రత్యేక రైలు (07017) సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 10 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా వరంగల్ టు సిర్పూర్ కాగజ్‌నగర్ (07018) రైలు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌నుంచి బయలుదేరి రాత్రి 12 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. సిర్పూర్‌కాగజ్‌నగర్–వరంగల్ మధ్య కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, కొత్తపల్లి, ఓదెల, కొలనూరు, కొత్తపల్లి, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్డు, రేపల్లెవాడ, ఆసిఫాబాద్, రాళ్లపేట్‌లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
ఇదీ చదవండి: TS: రవాణాశాఖలో భారీ ఎత్తున బదిలీలు.. ఉత్తర్వులు జారీ
Comments
Please login to add a commentAdd a comment