సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మరికాసేపట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం. ప్రధాని మోదీ రెండుసార్లు తెలింగాణకు వచ్చారు. అభ్యర్థుల ను ఎప్పుడు ప్రకటించాలన్నది మా ఇష్టం. నామినేషన్ చివరి వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేకమంది బీజేపీలోకి చేరుతున్నారు. ప్రజలు బీజేపీని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము రెడీగా ఉన్నామన్నారు.
కాగా, కిషన్‌రెడ్డి సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పూణే- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కర్నూల్ వరకు, కరీంనగర్-నిజామాబాద్ (మెము)బోధన్ వరకు, నాందేడ్-తాండూరు ఎక్స్‌ప్రెస్ రాయ్‌చూర్ వరకు పొడిగిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం మరో నాలుగు రైళ్లను పొడగించి ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే సర్వీసులను ప్రారంభించాం.
తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉంది. ప్రధాని మోదీ రైల్వే నెట్‌వర్క్ పెంచాలని చూశారు. అందులో భాగంగానే కొత్త రైళ్లను ప్రకటించారు. కొత్త ప్రాజెక్ట్‌లను కేంద్రం తెలంగాణకు ఇచ్చింది. రైల్వే అభివృద్ధి కోసం 5వేల కోట్లకు పెంచింది. 31వేల కోట్ల పనులు తెంగాణలో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి కల్లా చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించాలని చూస్తున్నాం. ఎంఎంటీఎస్ కొత్త ప్రోజెక్ట్‌లు కూడా కేంద్రం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు పొడిగిస్తాం.
హరీష్‌రావుపై ఫైర్
కొంత మంది రాష్ట్ర మంత్రులు అయ్యి ఉండి నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో హరీష్ రావు తీరు బాగోలేదు. సిద్ధిపేట ట్రైన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే.. రైల్వే అధికారులను తిట్టారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఈ తీరుగా ప్రవర్తించారు. గతంలో కూడా రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే మీకు బుద్ది చెబుతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: 15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
Comments
Please login to add a commentAdd a comment