టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్‌ను పంజాబ్ తమ కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటికే పంజాబ్ జట్టుతో కలిసిన గబ్బర్.. తమ హోం గ్రౌండ్ మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న కేకేఆర్‌తో తలపడనుంది.
ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన 15 ఏళ్ల వయస్సులో టాటూ కారణంగా హెచ్‌ఐవి పరీక్ష చేయించుకున్నట్లు గబ్బర్ తెలిపాడు. "నేను 15 ఏళ్ల వయస్సులో నా ఫ్యామిలీతో కలిసి మనాలి టూర్‌కు వెళ్లాను. అయితే నా కుటుంబ సభ్యులకు తెలియకుండా నేను నా భుజంపై టాటూ వేయించుకున్నాను. నేను అది కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలలవరకు దాచి ఉంచాను.
ఒక రోజు మా నాన్నకు నా పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. ఆయన నన్ను తీవ్రంగా కొట్టాడు. టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా కొంచెం భయపడ్డాను. ఎందుకంటే టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదితో శాడో నాకు తెలియదు. కాబట్టి మా నాన్నతో కలిసి వెళ్లి హెచ్‌ఐవి టెస్ట్ చేయించుకున్నాను. అది నెగెటివ్‌గా తేలింది" అని ఆజ్ తక్ షో 'సీధీ బాత్’లో ధావన్ పేర్కొన్నాడు.
చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment