IPL 2024 GT vs PBKS Live Updates:
గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు.
19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6
19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాలి.
ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్
150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్..
111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్
71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్
ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్
పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు.
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.
కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ డౌన్..
164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4
శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..
శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్
123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(46) ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్
69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌ల్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1
6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్‌మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0
2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే
Comments
Please login to add a commentAdd a comment