India tour of New Zealand, 2022- New Zealand vs India, 1st ODI: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతివాటం ఆటగాడు 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్(77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకంతో రాణించాడు. ఈ ముగ్గురి అద్భుత ఆట తీరుతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 306 పరుగులు స్కోరు చేసింది.
టాపార్డర్ హిట్!
కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 80 పరుగులు సాధించాడు.
టాపార్డర్ అద్భుతంగా రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. 23 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు.
సంజూ ఓకే.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ
ఇదిలా ఉంటే.. ఎన్నాళ్లుగానో జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి ధావన్ సేన 306 పరుగులు చేసి కివీస్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీకి మూడు, లాకీ ఫెర్గూసన్‌కు మూడు, ఆడం మిల్నేకు ఒక వికెట్ దక్కాయి.
చదవండి: IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment