India tour of New Zealand, 2022: టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన టీమిండియా న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతోంది. గతేడాది వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో కివీస్‌తో తలపడ్డ భారత జట్టు.. ఈసారి న్యూజిలాండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా పర్యాటక దేశానికి చేరుకుంది.
కాగా కివీస్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. వన్డే సిరీస్‌కు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా న్యూజిలాండ్ టూర్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం.
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 సిరీస్
మూడు మ్యాచ్‌ల సిరీస్
►మొదటి టీ20: నవంబరు 18, శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్‌టన్
►రెండో టీ20: నవంబరు 20, ఆదివారం- బే ఓవల్, మౌంట్ మాంగనీ
►మూడో టీ20: నవంబరు 22, మంగళవారం- మెక్‌లీన్ పార్క్, నేపియర్
►మ్యాచ్‌ల ఆరంభ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం)
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా వన్డే సిరీస్
మూడు మ్యాచ్‌ల సిరీస్
►మొదటి వన్డే: నవంబరు 25, శుక్రవారం- ఈడెన్ పార్క్, ఆక్లాండ్
►రెండో వన్డే: నవంబరు 27, ఆదివారం- సెడాన్ పార్క్, హామిల్టన్
►మూడో వన్డే: నవంబరు 30, బుధవారం- హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్
►మ్యాచ్‌ల ఆరంభ సమయం: ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం)
మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే!
అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం
►భారత్‌లో- టీవీ ప్రేక్షకులు డీడీ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు.
►న్యూజిలాండ్‌లో స్కై స్పోర్ట్స్ ఎన్‌జెడ్‌లో లైవ్ స్ట్రీమింగ్
►అమెరికాలో- డిస్నీ+హాట్‌స్టార్, ఈఎస్‌పీఎన్+
►యూకేలో- స్కై స్పోర్ట్స్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20)
చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’
T20 WC 2022: 'ఆఫ్రిదికి అంత సీన్ లేదు.. ఉన్నా ఇంగ్లండ్ విజయం సాధించేది
Comments
Please login to add a commentAdd a comment