
India Tour Of Zimbabwe: వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (జులై 30) ప్రకటించారు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు.. విండీస్‌లో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధవన్‌కు మరోసారి సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ సిరీస్ కోసం మాజీ సారథి విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. కోహ్లికి విశ్రాంతిని పొడిగిస్తున్నట్లు సెలెక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ 18న, రెండు, మూడో మ్యాచ్‌లు 20, 22వ తేదీల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగనున్నాయి.
భారత జట్టు...
శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్
చదవండి: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే
Comments
Please login to add a commentAdd a comment