వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్‌లో ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ధవన్ పంజాబ్ తదుపరి ఆడబోయే ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ తెలిపాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో నిన్నటి (ఏప్రిల్ 13) మ్యాచ్‌కు ముందు చివరి నిమిషంలో ధవన్ డ్రాప్ అయ్యాడు. ధవన్ ఏప్రిల్ 26న కేకేఆర్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఈ మధ్యలో పంజాబ్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు ధవన్ దూరం కావడం పంజాబ్‌కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ధవన్ గైర్హాజరీలో పంజాబ్‌ను సామ్ కర్రన్ ముందుండి నడిపించనున్నాడు. రాయల్స్‌తో మ్యాచ్, గత ఐపీఎల్ సీజన్‌లోనూ కర్రన్ పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, రాయల్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి హెట్‌మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాయల్స్‌ను గెలిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో హెట్‌మైర్ మరో సిక్సర్ కూడా బాదాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఖర్లో అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్‌ను ఝులిపించడంతో పంజాబ్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. అయితే హెట్‌మైర్ మెరుపులు మెరిపించి రాయల్స్‌ను గెలిపించాడు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment