దులీప్ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఇండియా-సితో ఇవాళ (సెప్టెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.
THE SHOW OF AXAR PATEL. 🔥
He smashed an excellent fifty when his team was 8 down on just 76 runs - AXAR PATEL, THE CRISIS MAN. 👏pic.twitter.com/ezWupOFTKQ— Tanuj Singh (@ImTanujSingh) September 5, 2024
అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
ఇండియా-సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్‌కుమార్ వైశాఖ్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్
ఇండియా-డి: దేవదత్ పడిక్కల్, యష్ దూబే, రికీ భుయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైడే (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే
Comments
Please login to add a commentAdd a comment