దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2024 ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బి, ఇండియా జట్లు తలపడతుండగా.. అనంతపురం వేదికగా భారత్-డి, భారత్-సి జట్లు ఆడుతున్నాయి.
బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఎ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. బి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. మరోవైపు అనంతపూర్ ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా సి జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 'ఎ' జట్టుకు శుబ్‌మన్ గిల్, బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సి జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్, డి జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నారు.
తుది జట్లు:
ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్
ఇండియా ఎ: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్
ఇండియా డి: దేవదత్ పడిక్కల్, యశ్ దూబే, రికీ భుయ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, అథర్వ తైదే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, సరన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఆదిత్య ఠాకరే
ఇండియా సి:రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, హృతిక్ షోకీన్, విజయ్‌కుమార్ వైషాక్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment