టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునేందుకు మరో అవకాశం దక్కింది. పరిమిత ఓవర్లలో భారత వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు.
బంగ్లాదేశ్‌తో టెస్టులకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యే అవకాశముంది. అంతకంటే ముందు దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ రూపంలో గిల్‌కు ఛాలెంజ్ ఎదురుకానుంది. దులీప్ ట్రోఫీ-2024 ఇండియా ‘ఎ’ జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీ తొలి రౌండ్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఇండియా-బితో భారత ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుబ్‌మన్ గిల్.. బి జట్టును తొలుత బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
ఈ సందర్భంగా తన ఆటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. "డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు సాధన చేశా. ట్రాక్‌పై స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా.
టి20లు ఎక్కువ ఆడటం వల్ల బ్యాటింగ్ పిచ్‌లపై డిఫెన్స్‌లో కాస్త వెనుకబడతాం. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు దానిపైనే దృష్టి సారించా. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు అనుకున్న స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయా. ఈ సీజన్‌లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆటతీరు మరింత మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తా" అని గిల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment