దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభానికి సమయం అసన్నమైంది. ఈ టోర్నీకి బెంగళూరుతో పాటు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ దేశీవాళీ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు జరుగనుంది.
అందులో 6 మ్యాచ్ లకు గాను.. అనంతపురంలో 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈసారి టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రికెటర్లు భాగం కానున్నారు. దీంతో ఈ టోర్నీకి స్టార్ కళ వచ్చింది.
స్టార్లు వచ్చేశారు..
ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత స్టార్ క్రికెటర్లు అనంతపురానికి వచ్చేశారు. పలువురు క్రికెటర్లు సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వీరిలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు.
క్రికెటర్లు బసచేస్తున్న హాటల్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని సందడి చేశారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, పంత్, సిరాజ్, గిల్ సైతం త్వరలోనే అనంతపుర్‌కు రానున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు బీసీసీఐ సెలెక్టర్లు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.
సరికొత్త మార్పులతో..
అయితే ఈసారి టోర్నీ గతం కంటే భిన్నంగా జరగనుంది. గతంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ మొత్తం ఆరు జోన్లు తలపడేది. ఇప్పుడు వాటిని ఎ, బి, సి, డి జట్లుగా మార్చారు. ఇండియా ‘ఎ’ జట్టుకు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ‘బీ’ జట్టుకు అభిన్యు ఈశ్వరన్, ‘సి’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ లు కెప్టెన్లుగా ఉండనున్నారు.
చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు
Comments
Please login to add a commentAdd a comment