దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా అనంతపూర్‌లోని ఆర్డీటీ స్టేడియం వేదికగా భారత్-సి, భారత్-డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకొచ్చాడు.
మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన సదరు అభిమాని.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత యువ ఓపెనర్, ఇండియా-సి టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా గైక్వాడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు. అతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ధోని వారుసుడిగా సీఎస్‌కే సారథ్య బాధ్యతలు రుతురాజ్ చేపట్టాడు.
అప్పటి నుంచి రుతురాజ్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా సి జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌటైంది. సి బ్యాటర్లలో బాబా ఇంద్రజిత్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
డి జట్టు బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్ పటేల్, జైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్-డి జట్టు 164 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సి జట్టుకు 4 పరుగుల ఆధిక్యంలో లభిచింది.
చదవండి: కుల్దీప్ భాయ్‌తో అంత ఈజీ కాదు.. వారిద్దరి వల్లే ఇదంతా: సెంచరీ హీరో
Comments
Please login to add a commentAdd a comment