శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇక అంతే సంగతి మరి? | Shreyas Iyers Poor Run In Red-Ball Cricket Continues | Sakshi
Sakshi News home page

DT 2024: శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇక అంతే సంగతి మరి?

Published Thu, Sep 5 2024 10:16 AM | Last Updated on Thu, Sep 5 2024 11:36 AM

Shreyas Iyers Poor Run In Red-Ball Cricket Continues

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్‌.. ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.

ఈ టోర్నీలో ఇండియా-సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్‌.. ఇండియా-డితో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 

విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్‌.. ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండడంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అతడి ఎంపికపై సందిగ్ధం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement