దేశీవాళీ క్రికెట్‌లో ముంబై యువ బ్యాటర్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా బి జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్న ముషీర్.. భారత బి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ‘బి’ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ముషీర్ ఒంటరి పోరాటం చేశాడు. తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. నవ్‌దీప్ సైనీ అండతో ముషీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (227 బంతుల్లో 105; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు సైనీ (74 బంతుల్లో 29 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) నాటౌట్‌గా నిలిచాడు.
ఇక తొలి రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముషీర్.. తన సెంచరీ క్రెడిట్‌ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌కు ఇచ్చాడు. "నేను కుల్దీప్ యాదవ్‌కు ప్రత్యర్ధిగా ఆడటం ఇదే రెండో సారి. అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్ అని మనకు తెలుసు. కుల్దీప్ భాయ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ మా జట్టులో రిషబ్ పంత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.
రిషబ్ భాయ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ కంటే ముందు నాకు కొన్ని సూచనలు చేశారు. కుల్దీప్ భాయ్ వేసిన బంతుల్లో ఏది అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో వారు నాకు చెప్పారు. అతడి బౌలింగ్‌లో ఏ బంతులను ఎటాక్ చేయాలో నాకు వారిద్దరూ వివరించారు. దీంతో నేను క్రీజులో సెట్ అయ్యాక అతడిని సులభంగా ఎదుర్కొన్నాను" అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment