గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. క‌ట్ చేస్తే మెరుపు సెంచ‌రీ? | Shubman Gills Replacement Pratham Singh Smashes A Blistering Ton In Duleep Trophy | Sakshi
Sakshi News home page

DT 2024: గిల్ ప్లేస్‌లో ఎంట్రీ.. క‌ట్ చేస్తే మెరుపు సెంచ‌రీ?(వీడియో)

Published Sat, Sep 14 2024 12:19 PM | Last Updated on Sat, Sep 14 2024 12:34 PM

Shubman Gills Replacement Pratham Singh Smashes A Blistering Ton In Duleep Trophy

దులీప్ ట్రోఫీ-2024ను ఇండియా-డి టీమ్ ఓపెన‌ర్ ప్రథమ్ సింగ్‌ ఘ‌నంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అనంత‌పూర్ వేదిక‌గా ఇండియా-డితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ప్రథమ్ సింగ్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్ధానంలో భార‌త-ఎ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌థ‌మ్‌.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. 

లెఫ్ట్‌హ్యాండ‌ర్ అయిన ప్ర‌థ‌మ్ సింగ్‌ త‌న క్లాసిక్ షాట్‌ల‌తో ఆల‌రించాడు. హ‌ర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌల‌ర్ల‌ను సైతం టార్గెట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొన్న అత‌డు 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 122 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రీ ప్ర‌థ‌మ్ సింగ్ నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు.

ఎవరీ ప్ర‌థ‌మ్ సింగ్‌?
31 ఏళ్ల ప్ర‌థ‌మ్ సింగ్ ఆగస్టు 31, 1992లో ఢిల్లీలో జన్మించాడు. అత‌డు ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్ రైల్వేస్‌కు ఆడుతున్నాడు. 2017లో మహారాష్ట్ర‌పై ప్ర‌థ‌మ్ ఫ‌స్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. సీనియర్ రైల్వేస్ జట్టు త‌ర‌పున ఆడేమందు.. రైల్వేస్ అండ‌ర్‌-19 జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

 ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 29 మ్యాచ్‌లు ఆడిన ప్ర‌థ‌మ్ సింగ్‌.. 35.63 స‌గ‌టుతో 169 ప‌రుగులు చేశాడు. అత‌డి కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు సెంచ‌రీలు, 10 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ప్ర‌థ‌మ్ ఐపీఎల్‌లో కూడా భాగ‌మ‌య్యాడు. 2017లో గుజ‌రాత్ టైటాన్స్ త‌రపున క్యాష్‌రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. 

ఆ త‌ర్వాత ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.20ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. 2024 సీజ‌న్ ఛాంపియ‌న్‌గా నిలిచిన కేకేఆర్ జ‌ట్టులో ప్ర‌థ‌మ్ స‌భ్యుడిగా ఉన్నాడు. కానీ అత‌డికి కేకేఆర్ త‌ర‌పున ఒక్క మ్యాచ్ కూడా అవ‌కాశం రాలేదు.
చదవండి: భార‌త మాజీ క్రికెట‌ర్‌కు షాక్‌.. నెల రోజులకే హెడ్‌కోచ్ పోస్ట్ ఊస్ట్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement