టీమిండియాకు శుభవార్త!!... టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ నాటికి అతడు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన అనంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి
ఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. పూర్తిస్థాయి సారథిగా తొలి సిరీస్‌లోనే భారత్‌కు ఈ ముంబై బ్యాటర్ క్లీన్‌స్వీప్(3-0) విజయం అందించాడు. అనంతరం టీమిండియాకు సుదీర్ఘ విరామం లభించగా.. టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా ‘స్కై’ రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు.
గాయం బారిన పడిన సూర్య
ఈ క్రమంలో ముంబై తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ బరిలో దిగాడు. అయితే, ఈ టోర్నీలో ఒకే మ్యాచ్‌లో పాల్గొన్న సూర్య.. పరుగులు రాబట్టలేకపోయాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడి కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో ఆ టోర్నీతో పాటు దులిప్ ట్రోఫీ-2024 తొలి రౌండ్‌కు కూడా సూర్య దూరమయ్యాడు.
సూర్య వేగంగా కోలుకుంటున్నాడు
తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు సూర్య. ఈ క్రమంలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ టీ20 ప్రపంచ రెండో నంబర్ బ్యాటర్.. గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఎన్సీఏ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయని హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘సూర్య వేగంగా కోలుకుంటున్నాడు. అతడు 100 శాతం ఫిట్‌నెస్ సాధించినట్లే’’ అని తెలిపినట్లు పేర్కొంది.
టీమిండియాకు భారీ ఊరట
ఈ నేపథ్యంలో 33 ఏళ్ల సూర్య దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇండియా-సి జట్టులో ఉన్న అతడు సెప్టెంబరు 12 నుంచి అనంతపురం వేదికగా జరుగనున్న మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ కోలుకోవడం టీమిండియాకు శుభసూచకం.
స్వదేశంలో అక్టోబరు 6 నుంచి బంగ్లాదేశ్‌తో మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరగవుతాయి. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కంటే ముందు టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబరు 19 నుంచి ఈ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment