బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైకి ప్రాతనిథ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రేయస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి అజిత్ రామ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. ప్రదోష్ 65, ఇంద్రజిత్ 61, భూపతి 82, అజిత్ 53 పరుగులు చేయగా.. ముంబై బౌలర్ హిమాన్షు 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
కాగా, బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు భారత సెలెక్టర్లను ఆకర్శిgచాలని శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సాయి కిషోర్, అజిత్ రామ్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరు మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ టోర్నీలో రాణిస్తే బంగ్లాతో సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడం దాదాపుగా ఖయమనే చెప్పాలి. అయితే ఈ టోర్నీలో సత్తా చాటడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ పరుగులు సాధించడం కష్టమవుతుంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో శ్రేయస్, సూర్యకుమార్ లాంటి చాలామంది క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టారు. టీమిండియాలో చోటే లక్ష్యంగా వీరంతా పావులు కదుపతునున్నారు.
Comments
Please login to add a commentAdd a comment